
పట్టాలు కోల్పోయిన వారికి ఇళ్లు ఇవ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలోని క్రిష్టియన్‌పల్లిలోని సర్వే నంబర్ 523లో ఇంటి స్థలాలకు చెందిన పట్టాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇవ్వాలని నిర్వాసితుల కమిటీ గౌరవ అధ్యక్షుడు రాంమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇంకా 385 మందికి పట్టాలు కోల్పోయిన వారిలో ఉన్నారని, మౌలాలి గుట్టలో నిర్మించిన జీఫ్లస్ ఇళ్లను వారికి కేటాయించాలని కోరారు. ఇంటిస్థలాలు ఇచ్చి ఇందిరమ్మ స్కీంను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ విజయేందిరకు అందజేశారు. ధర్నాలో అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి మంగమ్మ, ప్రచార కార్యదర్శి రాములు, ఉపాధ్యక్షులు వహిదాబేగం, మంజులాబాయి, సైదాబేగం, భార్గవి పాల్గొన్నారు.