
హద్దులను తేల్చాలి..
రెవెన్యూ, ఫారెస్టు భూముల హద్దుల సమస్యతో సరిహద్దు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు లావుణి పట్టాలు ఇచ్చినా భూములు దున్ననివ్వడంలేదు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు గతంలో ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా భూముల్లో కందకాలు తీయడం తగదు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి హద్దులను తేల్చాలి.
– నాగన్న, వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి
కలెక్టర్ ఆదేశించారు..
రెవెన్యూ, అటవీ భూముల సమస్యపై కొందరు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి ఏదో ఓ పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ సర్వే నిర్వహించి పరిష్కారం చూపేందుకు అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే ల్యాండ్ అధికారుల ద్వారా సర్వే చేపట్టేందుకు త్వరలో చర్యలు తీసుకుంటాం.
– సత్యనారాయణ, జిల్లా అటవీ శాఖాధికారి
●

హద్దులను తేల్చాలి..