
దాబాల్లోనూ విక్రయాలు..
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు కాగా 975 గ్రాముల ఎండు గంజాయి, 8 మంది అరెస్టు చేయడంతో పాటు మూడు వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. అలాగే జడ్చర్ల ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదు కాగా పది మంది అరెస్టు చేయగా రెండు కేజీల 650 గంజాయి, 8 సెల్‌ఫోన్లు, ఒక వాహనం సీజ్ చేశారు. జడ్చర్ల పరిధిలో జాతీయ రహదారి వెంట ఉన్న దాబాల్లో గంజాయి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల షాద్‌నగర్– బాలానగర్ మధ్యలో ఉన్న దాబాల్లో గంజాయి దొరకడమే ఇందుకు నిదర్శనం. రాజాపూర్ నుంచి టోల్‌గేట్ మధ్యలో ఉన్న కొన్ని హోటళ్లు, దాబాల్లో బయటి వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.