
మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో జరిగిన హెచ్‌సీఏ బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 68.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు 6 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసి మంగళవారం రెండో రోజు ఆట కొనసాగించిన రాకేష్ లెవన్ జట్టు మహబూబ్‌నగర్ బౌలర్ల ధాటికి 41.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. మహబూబ్‌నగర్ జట్టులో గగన్ 5, ముఖితుద్దీన్ 2, జశ్వంత్ 2, కె.శ్రీకాంత్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఎండీసీఏ అభినందనలు
టుడే లీగ్‌లో మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచుల్లో ప్రతిభ చాటాలని సూచించారు. లీగ్‌లో జిల్లా క్రీడాకారులు తమ వ్యక్తిగత నైపుణ్యాన్ని చాటుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు.
టుడే లీగ్‌లో 148 పరుగుల తేడాతో రాకేష్ లెవన్‌పై విజయం