
మొదటి రోజు పండగలా ఉండేది..
నేను మలక్‌పేట నెహ్రూ మెమోరియల్ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాను. కాలనీలో స్కూల్స్‌లో ఉండడం వల్ల పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది కాదు. సెలవుల తర్వాత మొదటి రోజు పాఠశాలకు వెళ్లాలి అంటే ఒక పండగా ఫీల్ అయ్యే వాళ్లం. బడి ప్రారంభం రోజు కొత్త టీచర్ ఎవరు వస్తారని ఆలోచించేవాళ్లం. పుస్తకాలు, నోటు బుక్కులు కొనుక్కోవడం ఉత్సాహంగా ఉండేది.
– ప్రవీణ్‌కుమార్, డీఈఓ
చాలా సంతోషంగా వెళ్లే వాళ్లం
ఎండకాలం సెలవులు ముగిసిన తర్వాత తొలిరోజు సంతోషంగా స్కూల్‌కు వెళ్లేవాళ్లం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని గుండుగుండ్లపాలెం మా సొంతూరు. మా ఊరి నుంచి పాలకవీడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నా. మా ఊరి నుంచి స్కూల్‌కు మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. ప్రతిరోజూ స్నేహితులతో కలిసి నడిచి వెళ్లే వాళ్లం. ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. స్కూల్ నాటి జ్ఞాపకాలు జీవితంలో మరిచిపోలేని తీపి గుర్తులు. – వెంకట్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ
●

మొదటి రోజు పండగలా ఉండేది..