నల్లమల అభయారణ్యంలో చిరుత
మన్ననూర్: నల్లమలలోని అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో సఫారీ ప్రయాణికులకు మంగళవారం చిరుత పులి కనిపించింది. నిజాం బంగ్లా (సికార్‌ఘర్) సమీపంలోని కొత్త రోడ్డు నుంచి చిరుత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లడాన్ని సఫారీ వాహనం డ్రైవర్ గమనించి పర్యాటకులకు తెలియజేశారు. దీంతో సెల్‌ఫోన్లలో చిరుతను చిత్రీకరించుకున్నారు. అభయారణ్యంలో అతి సమీపంగా చిరుత పులి కనించడంతో సఫారీ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు.
సంజీవగుట్టపై చిరుత సంచారం
మరికల్: మండలంలోని పూసల్‌పహాడ్ శివారు సంజీవ గుట్టపై మంగళవారం చిరుత సంచరించింది. దీంతో అటు వైపు రైతులు, గ్రామస్తులు వెళ్లాలంటనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సంజీవ గుట్టపై గత ఐదేళ్ల నుంచి చిరుత సంచరించడంతో పశువులను బలి తీసుకుందని రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బందించాలని కోరుతున్నారు.
నల్లమల అభయారణ్యంలో చిరుత


