
సినీఫక్కీలో నగదు చోరీ
కొత్తకోట రూరల్: బ్యాంకులో సీసీ కెమెరాల మధ్యన క్యాష్ కౌంటర్ నుంచి రూ.లక్ష నగదు డ్రా చేసుకొని జేబులో పెట్టుకున్న ఓ వ్యక్తి నుంచి గుర్తుతెలియని వ్యక్తి సినీఫక్కీలో అపహరించిన ఘటన సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోట యూనియన్ బ్యాంకులో చోటుచేసుకున్నదని సీఐ సీఐ రాంబాబు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అడ్డాకుల మండలం కన్మనూర్‌కు చెందిన మోడల శ్రీనివా సులు ఏడాది క్రితం కొత్తకోటలోని యూనియన్ బ్యాంకులో గోల్డ్‌లోన్ రూ.2లక్షలు తీసుకున్నాడు. రెన్యూవల్ చేసేందుకు వచ్చి రూ.2లక్షలు చెల్లించాడు. అనంతరం మళ్లీ గోల్డ్‌లోన్ రూ.లక్ష క్యాష్ కౌంటర్ నుంచి డ్రా చేసి ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కౌంటర్ నుంచి పక్కకు వచ్చి 5 నిమిషాల తర్వాత జేబులో చూసుకోగా.. డబ్బులు లేకపోవడంతో బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ రాంబాబు సిబ్బందితో బ్యాంకు దగ్గరకు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాంకులో సైరన్ పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్యాంకులో సీసీ కెమెరాలు తక్కువగా ఉండడంతో దొంగను పట్టుకునేందుకు కాస్త ఇబ్బందిగా ఉందని, బ్యాంకులో సీసీ కెమెరాల సంఖ్య పెంచాలని మేనేజర్‌కు సూచించారు. బ్యాంకు సీసీ కెమెరాలతోపాటు చుట్టుపక్కల కెమెరాల్లో దొంగ వివరాలను పరిశీలిస్తున్నామని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.
బ్యాంకులో వ్యక్తి నుంచి రూ.లక్ష కొట్టేసిన అగంతకుడు
గోల్డ్‌లోన్ రెన్యూవల్ చేసి బయటికొచ్చి చూసి కంగుతిన్న బాధితుడు