
లారీల ఢీ.. తప్పిన ప్రమాదం
భూత్పూర్: దివిటిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. జడ్చర నుంచి భూత్పూర్ వైపు పల్లిపొట్టు లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా భూత్పూర్ వైపు నుంచి వస్తున్న లారీని సైతం ఢీకొట్టింది. భూత్పూర్ వైపు నుంచి వస్తున్న లారీ ప్రమాదానికి గురి కాగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న ఓ కారు సైతం లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పొట్టులారీ డ్రైవర్ పారిపోయాడు. రోడ్డు ప్రమాదం వల్ల రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ సాయంతో లారీని పక్కకు లాగి రాకపోకలలను పునరుద్ధరించారు.