క్రీడా పాఠశాల పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాల పిలుస్తోంది

Jun 9 2025 12:56 AM | Updated on Jun 9 2025 12:56 AM

క్రీడ

క్రీడా పాఠశాల పిలుస్తోంది

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు త్వరలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగనున్నాయి. మేడ్చల్‌ జిల్లాలోని టీజీజీఎస్‌ఎస్‌ హకీంపేటతోపాటు కరీంనగర్‌, ఆదిలాబాద్‌లోని ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో వారికి 4వ తరగతిలో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్‌ స్కూళ్లు ఉండగా ప్రతి పాఠశాలలో 4వ తరగతిలో 20మంది బాలుర, 20మంది బాలికలను ఎంపిక చేస్తారు. స్పోర్ట్స్‌ స్కూళ్లలో చోటుదొరికితే అంతర్జాతీయస్థాయికి ఎదగవచ్చని పలువురు క్రీడానిపుణులు పేర్కొంటున్నారు.

మూడంచెల్లో ఎంపికలు

స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాల కోసం మూడంచెల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఈనెల 16నుంచి 19 వరకు మండలస్థాయి, 23నుంచి 26వరకు జిల్లాస్థాయి, జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయిలో ఎవరైతే ఎంపికవుతారో వారికి స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశం కల్పిస్తారు. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్‌, రోయింగ్‌, వాలీబాల్‌, జూడో, ఫెన్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనన్నారు.

కావాల్సిన ధ్రువపత్రాలు

స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశ ఎంపికకు విద్యార్థులు పలు ధ్రువపత్రాలతో హాజరుకావాలి. ఒరిజినల్‌ ఆధార్‌కార్డు, 4వ తరగతి చదువుతున్న సర్టిఫికెట్‌, వయస్సు ధృవీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, కమ్యూనిటీ సర్టిఫికెట్‌, ఐదు పాస్‌ఫొటోలు, విద్యార్థులు 8నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య పుట్టినవారు అర్హులు.

సద్వినియోగం చేసుకోవాలి

ఈనెల చివరి వారంలో జిల్లాస్థాయిలో స్పోర్ట్స్‌ స్కూళ్లకు ఎంపికలు నిర్వహిస్తాం. స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలు పొందితే విద్యార్థులకు మెరుగైన క్రీడా శిక్షణ లభిస్తుంది. వారు నైపుణ్యమైన క్రీడాకారులుగా ఎదగవచ్చు. ఎంపికల్లో అర్హులైన విద్యార్థులు పాల్గొని ప్రతిభచాటాలి.

– శ్రీనివాస్‌, డీవైఎస్‌వో, మహబూబ్‌నగర్‌

శారీరక, సామర్థ్య పరీక్షలు

విద్యార్థులకు శారీరక, సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తు, బరువు, 30మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, 800మీటర్ల రన్‌, 610 మీటర్ల షటిల్‌ రన్‌, మెడిసిన్‌ బాల్‌ త్రో, వర్టికల్‌ జంప్‌, ఫ్లెక్సిబిలిటీతోపాటు మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. వీటితోపాటు జిల్లాస్థాయిలో అదనంగా మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

హకీంపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్‌ స్కూళ్లు

4వ తరగతిలో విద్యార్థుల

ప్రవేశాలకు ఎంపికలు

ప్రతిపాఠశాలలో 20మంది బాలుర, 20 మంది బాలికలకు అవకాశం

ఈనెల 16నుంచి వచ్చేనెల 5వరకు మూడంచెల్లో పరీక్షలు

క్రీడా పాఠశాల పిలుస్తోంది 1
1/1

క్రీడా పాఠశాల పిలుస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement