
కాల్వ ఇలా.. నీరు పారేదెలా?
నెట్టెంపాడులో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి వచ్చే కాల్వ గట్టు మండలంలోని పెంచికలపాడు శివారులో మొదలై.. ఆరగిద్ద, గొర్లఖాన్దొడ్డి, గట్టు, మాచర్ల, బల్గెర, ఇందువాసి వరకు పారుతోంది. అయితే ఈ కాల్వలో జమ్మితోపాటుగా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. దీంతో కాల్వలో నీరు ముందుకు పారక తరుచుగా కోతకు గురవుతోంది. కాల్వ నీటిపై ఆధారపడి పంటలు పండించుకుంటున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే రెండు నెలల్లో కాల్వకు సాగునీటిని విడుదల చేస్తారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాల్వ మరమ్మతు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. – గట్టు