
అనన్య.. ప్రతిభ
పలుసార్లు కేరళ జట్టుకు..
అనన్యశ్రీ రెండుసార్లు కేరళ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. దేశంలోనే క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే కేరళ రాష్ట్రంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. తన ప్రతిభతో ఆ రాష్ట్ర జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించారు. 2022లో కేరళ రాష్ట్రం తరఫున ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్‌లో జరిగిన 23వ జాతీయస్థాయి, మహారాష్ట్ర సాంగ్లి జిల్లా ఇస్లాంపూర్‌లో జరిగిన 24వ జాతీయ యూత్ వాలీబాల్ పోటీల్లో ఆమె పాల్గొన్నారు. కేరళలో జరిగిన సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ, 2023లో అస్సాం రాష్ట్రం గౌవహాటిలో జరిగిన 71వ ఉమెన్ సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు కేరళ రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో కేరళ మహిళా జట్టు విజేతగా నిలవడంతో అనన్యశ్రీ బంగారు పతకం సాధించారు. పాండిచ్చేరిలో జరిగిన ఫెడరేషన్ కప్ వాలీబాల్ పోటీల్లో అనన్యశ్రీ పాల్గొనగా.. కేరళ రాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది.
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలోని మక్తల్‌కు చెందిన అనన్యశ్రీ వాలీబాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. తల్లిదండ్రులు పి.ఆనంద్, వరలక్ష్మి ప్రోత్సాహంతో వాలీబాల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2018లో అప్పటి జిల్లా యువజన, క్రీడల అధికారిణి సత్యవాణి ఆధ్వర్యంలో పొడ గారి బాలికల క్రీడా నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. 180 సెం.మీ. ఎత్తు ఉన్న అనన్యశ్రీ వాలీబాల్ క్రీడకు ఎంపికయ్యారు. అనంతరం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన వాలీబాల్ అకాడమీ ప్రవేశ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచారు. అక్కడ వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి.. 2019లో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా అథ్లెట్ పథకం కింద కేరళలోని పట్టణమిట్టలో గల వాలీబాల్ అకాడమీకి అనన్యశ్రీ ఎంపికై 2024 ఆగస్టు వరకు శిక్షణ తీసుకున్నారు. గతేడాది క్రీడా కోటా కింద పూణెలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగం సాధించారు.
మూడు సార్లు తెలంగాణకు ప్రాతినిధ్యం..
2018 పంజాబ్ (చండీగఢ్)లో జరిగిన జూనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలో సరూర్‌నగర్ వాలీబాల్ అకాడమీ తరఫున అనన్యశ్రీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 తమిళనాడు రాష్ట్రం ధర్మపురి, 2020 కడపలో జరిగిన జూనియర్ నేషనల్, మరో జూనియర్ నేషనల్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే లక్ష్యం..
రెండోసారి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నా. 2023లో చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్నాను. వియత్నాంలో జరిగే ఆసియా వాలీబాల్ టోర్నీలో పాల్గొనే భారత మహిళా జట్టుకు ఎంపికై నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే లక్ష్యం. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నా. – అనన్యశ్రీ, మక్తల్
వాలీబాల్ క్రీడలో రాణిస్తున్న పాలమూరు బిడ్డ
ఆసియా వాలీబాల్ టోర్నీకి ఎంపిక
వియత్నాంలో నేటి నుంచి 14వ తేదీ వరకు పోటీలు
రెండోసారి అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం
ఆసియా వాలీబాల్ పోటీలకు ఎంపిక..
అనన్యశ్రీ రెండోసారి విదేశీ గడ్డపై వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. చైనా దేశం చెంగ్డు నగరంలో 2023 ఆగస్టులో జరిగిన ‘వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్’లో కేరళ యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొన్న ఆమె.. ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో జరిగిన ఇండియన్ వుమ న్ జట్టు శిక్షణ క్యాంపులో అనన్యశ్రీ పాల్గొ ని వియాత్నంలో ఈనెల 7 నుంచి 14 వరకు వియత్నాంలోని హనోయిలో జరిగే ఆసియా వాలీబాల్ టోర్నీలో భారత జట్టుకు ఎంపికై ంది.

అనన్య.. ప్రతిభ