
పుంజుకున్న ఉల్లి ధరలు
దేవరకద్ర: స్థానిక మార్కెట్‌లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు పుంజుకున్నాయి. ప్రస్తుతం సీజన్ తగ్గిపోయి మార్కెట్‌కు తక్కువ మొత్తంలో ఉల్లి అమ్మకానికి వచ్చింది. సీజన్ ప్రారంభం నుంచి గత వారం వరకు ఉల్లి ధర రూ.2వేలు దాటని పరిస్థితి ఉండేది. కానీ మార్కెట్‌కు ఉల్లి బస్తాలు తక్కువగా వస్తుండడంతో క్రమంగా ధరలు పెరుగుతున్నాయి.
జోరుగా కొనుగోళ్లు..
మార్కెట్‌కు వివిధ గ్రామాల నుంచి దాదాపు రెండు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వ్యాపారులు నిర్వహించన వేలంలో ఉల్లి ధర గరిష్టంగా రూ. 2వేలు, కనిష్టంగా రూ. 1100 వరకు పలికాయి. గత వారంతో పోల్చితే ధరలు స్వల్పంగా పెరిగాయి. గతంలో 50 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ. వెయ్యి, కనిష్టంగా రూ. 600 వరకు విక్రయించారు. చిన్నగా పేడు ఉల్లికి గరిష్టంగా రూ. 750 నుంచి కనిష్టంగా రూ. 250 వరకు ధరలు వచ్చాయి.
ఆర్‌ఎన్‌ఆర్ ధర రూ. 1659
దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధా న్యం ధర క్వింటాల్‌కు రూ. 1,659 పలికింది. ప్రస్తు తం ధాన్యం సీజన్ కూడా బాగా తగ్గినందున కేవ లం వంద బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2వేలు
కనిష్టంగా రూ.1100