
హమాలీ కాలనీలో మొసలి సంచారం
గద్వాల క్రైం: గద్వాల పట్టణంలోని హమాలీ కాలనీలో మొసలి కలకలం సృష్టించింది. కాలనీ వాసుల కథనం మేరకు.. మంగళవారం తెల్లవారు జామున మొసలి సంచారిస్తుండగా కుక్కలు గుర్తించి వెంటపడ్డాయి. దీంతో కాలనీ వాసులు నిద్ర లేచి చూడగా మొసలి ఇళ్ల మధ్యలోకి వచ్చింది. వెంటనే దానిని అతి కష్టం మీద తాళ్లతో బంధించారు. ఉదయమే ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని జూరాల ప్రాజెక్టు నీళ్లలో విడిచి పెట్టారు. జూరాల ప్రాజెక్టుకు ఇటీవల ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద జూరాలకు చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసిన క్రమంలో కుడి కాలువ మీదుగా మొసలి సమీపంలో జమ్ములమ్మ రిజర్వాయర్ ఉండడం, చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీటి మడుగులు ఉండడం ద్వారా మొసలి వచ్చి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.