లింగాల: మండలంలోని అంబట్‌పల్లిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. అంబట్‌పల్లికి చెందిన వేముల శివ (25) మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని తమ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి శ్రీను ఇది వరకే మృతి చెందగా.. తల్లి లక్ష్మి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.