
ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సెమిస్టర్–1, 3కి సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. సెమిస్టర్–1లో 74 శాతం ఉత్తీర్ణత కాగా, 3వ సెమిస్టర్‌లో 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పీయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచ్చినట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, కోఆర్డినేటర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
430 మంది గైర్హాజరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో కలిపి 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 4వ సెమిస్టర్‌కు సంబంధించి మొత్తం 8,924 మంది విద్యార్థులకు హాజరుకావాల్సి ఉండగా 8,524 మంది హాజరై 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో సెమిస్టర్–5 బ్యాక్‌లాగ్ పరీక్షలకు సంబంధించి 299 మందికి 266 మంది హాజరయ్యారు.
నేటినుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా మొత్తం 19 పరీక్ష కేంద్రాలలో ఈనెల 22 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఆరంభం కానున్నాయి. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 9,069 మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరంలో జనరల్ కోర్సులకు సంబంధించి 5,280 మంది, ఒకేషనల్‌లో 507 మంది ఉన్నారు. ఇక రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో 2,899 మంది, ఒకేషనల్‌లో 383 మంది పరీక్షలు రాయనున్నారు. మొదటి సెషన్ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయి. కాగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ కౌసర్ జహాన్ తెలిపారు.
ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంగా కవిత
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ఆర్‌ఎంగా జె.కవిత నియమితులయ్యారు. ఈమె ప్రస్తు తం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ వర్క్‌షాప్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. కాగా, 2012లో మహబూబ్‌నగర్ డిపో మేనేజర్‌గా వ్యవహరించారు. ఇక ఖమ్మం డిప్యూటీ ఆర్‌ఎంగా పనిచేస్తూ గత నెలలో ఇక్కడికి బదిలీపై వచ్చిన భవానీప్రసాద్ పదోన్నతిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆర్‌ఎంగా వెళ్లారు.
నేడు హనుమత్ జయంతి కార్యక్రమాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో గురువారం హనుమత్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సంయోజకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి, మహబూబ్‌నగర్‌లోని బండ్లగేరి, కిసాన్‌నగర్‌లోని ఆంజనేయస్వామి దేవాలయం, షాద్‌నగర్ వెంకట రమణకాలనీలో, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల, ఊర్కొండ మండలం నర్సాపూర్, వంగూరు, నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామం, ఉట్కూర్ మండలం బిజ్వార్, ధన్వాడ మండలం కిష్టాపూర్, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల, పెద్దమందడి మండలం చిన్నమందడిలో, వనపర్తి మండలం కడుకుంట్ల, జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం ఉత్తనూరులో, వడ్డేపల్లి మండలం పైపాడు, గద్వాల మండలం బీరెల్లి గ్రామాల్లోనిఆంజనేయస్వామి దేవాలయాల్లో హనుమత్ జయంతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో వివిధ సత్సంగ మండళ్ల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని తెలిపారు.