
ఉద్యోగం పోయిందని..
ఇటిక్యాల: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ కఽథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన భరత్ కుమార్ (22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల ఉద్యోగం కోల్పోవడంతో భరత్ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇటిక్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
విద్యుత్‌షాక్‌తో మూడు ఎద్దుల మృతి
మాగనూర్: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మూడు ఎద్దులు మృతి చెందిన ఘటన మండలంలోని కోల్పూర్‌లో బుధవారం జరిగింది. మందిపల్లికి చెందిన రైతు రంగప్ప వరి కోతలు ముగియడంతో మేత కోసమని ఎద్దులను కృష్ణ నది సమీపంలో వదిలేశారు. మేత మేసే క్రమంలో ఎద్దులు నది దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలోకి వెళ్లగా విద్యుదాఘాతానికి గురై ఒకే సారి మూడు ఎద్దులు మరణించాయి. ఎద్దులు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని అధికారులను కోరారు.

ఉద్యోగం పోయిందని..