
హడలెత్తిస్తున్న మొసళ్లు
కృష్ణా: మండలంలో ఒక పక్క భీమానది, మరో పక్క కృష్ణానది ప్రవహిస్తుండడంతో ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైతులు నది నుంచి వ్యవసాయ పొలాలకు నీరు తరలించేందుకు నది ఒడ్డున మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో నీటి మోటార్ల వద్ద మొసళ్ల దాడులతో మృత్యువాత పడుతున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం నది బడ్డున నీటిలో మోటార్లు ఏర్పాటు చేసుకున్న చోట రక్షణ కంచె ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.
రైతును లాక్కెళ్లిన మొసలి
మండలంలోని కుసుమర్తి గ్రామానికి చెందిన రైతు తిప్పణ్ణను గత శనివారం మొసలి లాక్కెళ్లడంతో ప్రాంత రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు రోజులైన అతని ఆచూకీ లభించక లేదు. మొసలి రక్తం రూచి చూడటంతో అదే ప్రాంతంలో సంచరిస్తుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆచూకీ కోసం విశ్వప్రయత్నాలు
నదిలో మొసలి పట్టుకెళ్లిన రైతు తిప్పణ్ణ ఆచూకీ కోసం గత శనివారం మధ్యాహ్నాం నుంచి నేటి వరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు, రెస్య్కూ అండ్ ఫైర్ డిపార్ట్‌మెంట్, గజ ఈతగాళ్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఆచూకీ లభించడం లేదు. రాత్రీపగలు తేడా లేకుండా సంఘటన ప్రాంతంలోనే అన్నిశాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
కంచే లేక జాలి నిర్మించాలి
ప్రభుత్వం నది ఒడ్డున మోటర్లు ఏర్పాటు చేసుకున్న చోట, నీటి మడుగులు ఉన్నచోట కంచె లేదా జాలిని ఏర్పాటు చేయాలని రైతులు కోరతున్నారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగకుండగా తగు చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదా నదుల్లోని మొసళ్లను వేరే ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..
భీమానదిలో గత శనివారం నుంచి అధికారులతో కలిసి రెస్య్కూ అండ్ ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీసులు, అటవీశాఖ అధికారులుతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఈ నెల 21న బుధవారం 12 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం చేరుకుంది.
– పుష్పలత, తహసీల్దార్, కృష్ణా
రక్షణ కల్పించాలి
భీమా నదిలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. ప్రధానంగా నదిలో రైతుల మోటర్లు ఏర్పాటు చేసుకున్న చోట కంచె ఏర్పాటు చేయాలి.
– సూకూర్‌లింగంపల్లి ఆంజనేయులు, రైతు
ఆవేదనలో ఉన్నాం
మా కుటుంబానికి చెందిన తిప్పణ్ణను మొసలి లాకెళ్లి నాలుగు రోజులవుతుంది. ఇంత వరకూ ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులమంతా తీవ్ర ఆవేదనలో ఉన్నాం. తిప్పన్న ఆచూకీ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం.
– శరణప్ప, బాధిత కుటుంబ సభ్యుడు
నిత్యం ప్రమాదాల బారిన ప్రజలు
రక్షణ కంచె ఏర్పాటు చేయాలని
వినతులు
భీమా, కృష్ణానదిలో వందల సంఖ్యలో మొసళ్ల సంచారం

హడలెత్తిస్తున్న మొసళ్లు

హడలెత్తిస్తున్న మొసళ్లు

హడలెత్తిస్తున్న మొసళ్లు

హడలెత్తిస్తున్న మొసళ్లు