కొల్లాపూర్: కృష్ణానదిలో ఎనిమిది నెలలు మునిగి ఉన్న సంగమేశ్వరాలయం పూర్తిగా తేలింది. గురువారం తెల్లవారుజాము వరకే ఆలయ ప్రాంగణం మొత్తం పూర్తిగా నది నీటి నుంచి బయటపడింది. దీంతో గర్భగుడిలో నీటిని బయటకు ఎత్తిపోశారు. నది నీరు తొలగిపోవడంతో ఆలయంలోని వేపదారు శివలింగం భక్తులకు దర్శనమిచ్చింది. శివలింగానికి ఆలయ అర్చకులు రఘురామశర్మ శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నీటిలో మునిగి ఉండటం కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం బురదమయంగా మారడంతో పరిసరాలు శుభ్రం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు అర్చకులు వెల్లడించారు. గతేడాది జూలై 17న సంగమేశ్వరాలయం కృష్ణానదిలో మునిగింది.
గర్భగుడిలోని శివలింగానికి పూజలు
ఆలయ పరిసరాలు శుభ్రం చేసేందుకు చర్యలు
8నెలల తర్వాత తేలిన సంగమేశ్వరాలయం