మక్తల్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. కొందరు అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. ఇదే కోవకు చెందిన మక్తల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంజిత్‌కుమార్‌రెడ్డి ఏకంగా వందసార్లు అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి భక్తిభావం చాటుకున్నారు. గురువారం వందోసారి తిరుమలకు కాలినడకన వెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రతినెలా అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు.