కనులపండువగా కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా కల్యాణోత్సవం

Mar 13 2025 11:35 AM | Updated on Mar 13 2025 11:31 AM

భక్తులతో కిటకిటలాడిన రామలింగేశ్వరస్వామి ఆలయం

అడ్డాకుల: కందూర్‌ శ్రీరామలింగేశ్వర క్షేత్రంలో బుధవారం కల్యాణోత్సాన్ని కనులపండువగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో మహిళలు సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యాన్ని ప్రత్యేక పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసు కొచ్చారు. అనంతరం పురోహితుల వేదమంత్రాల మధ్య ఉత్సవమూర్తులకు కల్యాణ వేడుకను నిర్వహించారు. కారెడ్డి నాగిరెడ్డి, తోకల దామోద్‌రెడ్డిరెడ్డిలు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించి, శివలింగాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.

● ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, కవిత దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వరాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ ఆవరణలో ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్లు, మంచి నీటి కుళాయిలను ప్రారంభించారు. బ్రహ్మో త్సవాల ఏర్పాట్లను పరిశీలించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ అనంతసేన్‌రావు, నాయకులు అరవింద్‌రెడ్డి, నాగిరెడ్డి, తోట శ్రీహరి, జగదీశ్వర్‌, నాగార్జున్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement