
ఆపద మిత్రలు అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామాల్లో జరిగే విపత్తుల సందర్భంగా ఆపద మిత్రలు అప్రమత్తమై గోల్డెన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎ్‌స్‌డీఆర్‌ఎఫ్ రాష్ట్ర నోడల్ అధికారి గౌతమ్ అన్నారు. గురువారం జెడ్పీ హాల్‌లో ఆపద మిత్రలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తుల నివారణ సంస్థతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ జిల్లాలో 300 మంది ఆపద మిత్ర వలంటీర్లకు 3 దశలలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రమాదాలు జరినప్పుడు ఎలా వ్యవహరించాలో వారికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో గోల్డెన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర అధికారులు ఆర్‌ఎస్ మిశ్రా, లికున్ పాత్రా, జిల్లా ఫైర్ అధికారి కిశోర్, తహసీల్దార్ జె. సువర్ణరాజు, జిల్లా శిక్షణ కేంద్ర కోఆర్డినేటర్ హన్మంతు పాల్గొన్నారు.