
మాట్లాడుతున్న శాస్త్రవేత్త జ్యోత్స్న
బిజినేపల్లి: భవిష్యత్‌లో ఫుట్ ప్రాసెసింగ్‌కే అధిక ప్రాధాన్యం ఉంటుందని పాలెం కేవీకే గృహవిజ్ఞాన శాస్త్రవేత్త జ్యోత్స్న అన్నారు. గురువారం పాలెం కేవీకే, డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మూడురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ వ్యవసాయంలో ప్రత్యక్షంగా ఆహార ఉత్పత్తులను విక్రయించడం కంటే.. ప్రాసెసింగ్ చేసి ఆకర్షణీయంగా మార్కెట్‌కు తరలిస్తే అధిక లాభాలు ఉంటాయన్నారు. ఆహార అనుబంధ సంస్థల స్థాపనకు కావాల్సిన ప్రణాళిక, వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళలు ఒక సమూహంగా ఏర్పడి చిన్నచిన్న వ్యాపారాలను స్థాపించాలని తెలిపారు. తద్వారా కుటుంబ పోషణ, ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో కేవీకే కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి, డీఆర్డీఏ ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం సుధాకర్ పాల్గొన్నారు.