
మక్తల్లో ఇంట్లోకి దూసుకెళ్లిన బూడిద టిప్పర్
మక్తల్: బూడిద లోడ్‌తో ఉన్న టిప్పర్ కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటలకు మక్తల్ నల్లజానమ్మ దేవాలయం మలుపు వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్తతో పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. మక్తల్‌కు చెందిన ఇంటి యాజమానురాలు పద్మమ్మ స్వల్పంగా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రాత్రి అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వృద్ధురాలిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బూడిద టిప్పర్ ఇంట్లోకి తీసుకెళ్లడంతో రోడ్డుకు ఇరువైపుల ఉన్న స్తంభాలు విరిగిపోయి, ఇట్లోంని వడ్రంగి పరికరాలు విరిగిపోయి, ఇల్లు మొత్తం బూడిదమయమైంది. బూడిద లారీలకు అనుమతి ఎవరు ఇచ్చారని పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పర్వతాలు తెలియజేశారు. టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
రేషన్ బియ్యం పట్టివేత
చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి స్టేజీ వద్ద రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వా హనాన్ని బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. అమరచింత మండలానికి 13 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా.. పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్ ఐ శేఖర్ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఫ వృద్ధురాలికి గాయాలు
ఫ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి