
నవాబుపేట: ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా తల్లీకూతుళ్లు అదృశ్యమైన సంఘటన మండలంలోని మల్కపూర్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు... మల్కపూర్‌కు చెందిన వడ్డె యాదమ్మ(38), ఆమె కూతురు వడ్డె నందిని(15) అనే తల్లికూతుళ్లు గత సోమవారం 27వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని అప్పటి నుంచి బంధువులతో పాటు గ్రామంలో తెలిసిని వారితో వెతికిన లాభం లేకపోవటంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అదృశ్యమైన మహిళ భర్త నర్సింహులు తెలిపారు. కాగా తాను తన కొడుకు ఎప్పటి మాదిరిగా రాళ్లు కొట్టేందుకు వెళ్లామని, తీరా సాయంత్రం ఇంటికి వచ్చే సరికి వారు కనిపించటేదని వివరించారు. కాగా నాలుగేళ్ల క్రితం అదృశ్యం అయిన మహిళ అక్క నా మొదటి భార్య శాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందితే ఆమె చెల్లెలు అయిన యాదమ్మతో రెండో వివాహం చేసుకున్నట్లు నర్సింహులు తెలిపారు. కాగా సంసారం సాఫీగానే సాగుతున్న తరునంలో వీల్లు ఇంట్లో నుంచి అదృశ్యం కావటంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన వివరించారు. ఈ విషయంలో కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు.
అదృశ్యమైన తల్లి, కూతురు
