● దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ సుదర్శన్
ఖిలా వరంగల్ : రానున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 120 స్థానాలకు దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి అభ్యర్థులను స్వతంత్ర హోదాలో నిలబెడతామని రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ మొగిలిచెర్ల సుదర్శన్ పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో మురహరి కార్తీక్ అధ్యక్షతన వినియోగదారుల సమాఖ్య సమితి డివిజన్ బాధ్యుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుదర్శన్ హాజరై మాట్లాడారు. సెలెక్టెడ్ కమిటీ కన్వీనర్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిడ్డి లక్ష్మీనారాయణ అభ్యర్థుల ఎంపిక చేశారని, డివిజన్‌కు 10 నుంచి 14 మంది గుర్తించి 120 స్థానాల్లో 1,367 మందిని కమిటీ ఎంపిక చేసిందని గుర్తు చేశారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా విభాగాలకు సమానంగా ఉన్నారని వివరించారు. ఓటు అమ్ముకోకుండా ఓటింగులో ఎంత మంది పాల్గొన్నారనేది ఒక సామాజిక పరీక్ష అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్స్ మురరిశెట్టి యశ్వంత్‌కుమార్, ఆర్.ఆనందరావు, బండి అనిల్‌కుమార్, బత్తిని శ్రీనివాస్‌రావు, కృపాకర్, సభ్యులు హరికృష్ణ, సాయిచంద్, రాజేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


