ఆర్టీసీలో డ్రైవర్లే కీలకం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో డ్రైవర్లే కీలకం

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

హన్మకొండ : టీజీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్ల పాత్ర కీలకమని, డ్రైవింగ్‌తోపాటు కండక్టర్‌ బాధ్యత నిర్వహిస్తున్నారని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండ పద్మాక్షికాలనీలోని దేవాలయ ఫంక్షన్‌ హాల్‌లో ఆర్టీసీ డ్రైవర్ల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ గతంలో ఒక్క యాక్సిడెంట్‌ విషయంలోనే ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు టికెట్‌ జారీ, బస్సులు సరిగ్గా ఆపలేదని, కేఎంపీఎల్‌ తీసుకురావడం లేదని వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పేరిట చేయని తప్పునకు శిక్ష విధిస్తున్నారని మండిపడ్డారు. వన్‌మ్యాన్‌ సర్వీస్‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, ఘాట్‌ రోడ్లలో 14 గంటల పాటు వన్‌మ్యాన్‌ సర్వీస్‌లపై విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉందన్నారు. సింగిల్‌ క్రూ డ్యూటీలతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

సదస్సులో చేసిన తీర్మానాలు..

శాసీ్త్రయమైన రూట్‌ సర్వే చేసి డ్యూటీ 141 చార్టు తయారు చేయాలి. ఎండీడబ్ల్యూ యాక్ట్‌కు అనుగుణంగా డ్యూటీలు మార్చాలి. 12 గంటలకు మించి డ్యూటీ ఉండరాదు. 12 గంటల డ్యూటీకి స్పెషల్‌ ఆఫ్‌ విధిగా అమలు చేయాలి. ట్రాఫిక్‌ చలాన్లకు డ్రైవర్‌ను బాధ్యుడి చేయొద్దు, చలాన్లు సంస్థే భరించాలి. ఎక్స్‌ప్రెస్‌ డ్యూటీలు, ఘాట్‌ రోడ్ల రూట్‌లో కండక్టర్‌ సర్వీస్‌లు నడుపాలి. రాత్రి పూట 4 గంట లకు మించి డ్రైవింగ్‌ చేయకుండా డ్యూటీలు వేయా లి. వేసవిలో రోజుకు రూ.100 చొప్పున హీట్‌ అలవెన్స్‌ ఇవ్వాలి. డ్యూటీ రిపోర్టింగ్‌ చేయకముందే బ్రీ తింగ్‌ టెస్ట్‌ చేయాలి. 30 ఎంజీ/100 గ్రాములు దా టితే ఆ రోజు డ్యూటీకి పంపొద్దు, మూడుసార్లు పా జిటివ్‌ వస్తే రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపాలి. ఉ ద్యోగ భద్రత 2022 గైడ్‌లైన్స్‌ రద్దు చేయాలి. ఎంవీ యాక్టు 2019 సెక్షన్‌ 178 (2ఏ), (2బీ)ని అమలు చే యాలి. డ్రైవర్‌పై కేసులు రాయొద్దు, స్పాట్‌ ఎక్స్‌ప్లనేషన్‌, డిపోస్పేర్‌ రద్దు చేయాలి. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్ర చార కార్యదర్శి పీఆర్‌ రెడ్డి, సీహెచ్‌ రాంచందర్‌, బ త్తుల సుదాకర్‌, శ్రీనివాస్‌, తాళ్లపల్లి ఎల్లయ్య, ఉపే ంద్రచారి, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు పాల్గొన్నారు.

స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు

పద్మాక్షికాలనీలో ఆర్టీసీ డ్రైవర్ల

రాష్ట్రస్థాయి సమావేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement