వరంగల్ స్పోర్ట్స్ : సైక్లింగ్ క్రీడా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దామని హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రెడ్డికాలనీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం సాయంత్రం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బొద్దిరెడ్డి హాజరై మాట్లాడారు. హనుమకొండలో జూలై, ఆగస్టులో రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. యువతలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు సైక్లింగ్‌ను ఒక క్రీడ పోటీగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాష్ యాదవ్, హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అడప వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఐత కిషన్, కోశాధికారి గద్దల అనిల్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యవర్గ సభ్యులు దుపాకి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు తీగల సుదన్, రామకృష్ణ, అక్రమ్, విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అసోసియేషన్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి


