బచ్చన్నపేట : అభం శుభం తెలియని ఓ చిన్నారి అధికారుల నిర్లక్ష్యానికి బలైంది. మిషన్ భగీరథ పైపులు మార్చడానికి తీసిన గుంతలో పడి మృతి చెందింది. ఈ ఘటన గురువారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎలికట్టె కవిత, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు దక్షిత, మోక్షిత(04) ఉన్నారు. దక్షిత ఒకటో తరగతి చదువుతుండగా, మోక్షిత అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుంది. కవిత గ్రామంలో అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్లను పాఠశాల గేటు పక్కన నిలబెట్టి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. ఈ సమయంలో మోక్షిత గేటు పక్కనే ఉన్న మిషన్‌భగీరథ గుంతలో పడింది. గమనించిన దీక్షిత తల్లి వద్దకు వెళ్లి చెప్పగా కవిత వెంటనే వచ్చి మోక్షితను బయటకు తీసింది. అనంతరం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించా రు. వెంటనే చిన్నారి మృతదేహంతో గ్రామంలో బచ్చన్నపేట– చేర్యాల జాతీ య రహదారిపై ఆందోళన నిర్వహించారు. మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల క్రితం తీసిన గుంతను పూడ్చకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమి ంచేది లేదని భీష్మించారు. ఈ విషయం తెలుసుకున్న నర్మెట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లను పిలిచి న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మోక్షిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, సర్పంచ్ పాకాల నాగలక్ష్మి, మాజీ సర్పంచ్ నరెడ్ల బాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మసూద్, పలు పార్టీల నేతలు మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
● ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్
● ఆయా బ్యారేజీల పరిశీలన
ఆలింపూర్‌లో ఘటన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన


