సీసీ కెమెరాల ఏర్పాటుతో రక్షణ: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాల ఏర్పాటుతో రక్షణ: ఎస్పీ

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

గూడూరు: ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తే శాంతిభద్రతల పరిరక్షణ కల్పించినట్లేనని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు ధరించాలని తీర్మానం చేసిన పొనుగోడు గ్రామాన్ని సందర్శించారు. ఈమేరకు గ్రామంలో ఎన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు ఎంతమంది హెల్మెట్‌లు వినియోగిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని రికార్డులు, కేసుల వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు పరిశీలించి, పలు సూచనలు చేశారు. అదే విధంగా మండలంలోని ప్రతీ జీపీ, మేజర్‌ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

అంగన్‌వాడీ టీచర్‌,

ఆయా తొలగింపు!

మరిపెడ రూరల్‌: గత ఏడాది మండలంలోని గిరిపురం గ్రామ పంచాతీయ పరిధి ఇటుకలగడ్డతండా అంగన్‌వాడీ కేంద్రంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై అప్పటి కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ చేపట్టి బాధ్యులైన అంగన్‌వాడీ టీచర్‌, ఆయాలను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.

ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకోవాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రజలు ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం మన ఇసుక వాహన పథకంపై అవగాహన కల్పించారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మైనింగ్‌ అధికారి, తహసీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలకు ఇసుక వాహనం, ఆన్‌లైన్‌లో ఇసు క కేటాయింపులపై టెక్నికల్‌ అసిస్టెంట్‌ నరేష్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇకపై పూర్తిస్థాయిలో ఇసుక సరఫరా కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలన్నారు. అందుకు మన ఇసుక వాహనం పథకంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు వెంకటరమణ, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారం సబ్‌ సెంటర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

గంగారం: ఉత్తమ వైద్యసేవలు అందించిన మండలంలోని కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని కామారం సబ్‌సెంటర్‌కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు ప్రదానం చేశారు. గర్భిణుల ముందస్తు నమోదు, ఏఎన్‌సీ పరీక్షలు, రోగనిరోధక టీ కాల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు అవార్డు అందజేశారు. సబ్‌సెంటర్‌ సిబ్బ ందిని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌ అభినందించారు.

కేసముద్రం మార్కెట్‌కు కొత్త పసుపు

కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం కొత్త పసుపు అమ్మకానికి వచ్చింది. సీజన్‌ ప్రారంభంలోనే క్వింటా పసుపు ధర రికార్డు స్థాయిలో రూ.12వేలకు పైగా పలికింది. కాడి రకానికి చెందిన 35 బస్తాల పసుపు మార్కెట్‌కు అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.12,523, కనిష్ట ధర రూ.10,703 పలికింది. అదే విధంగా గోళా రకానికి చెందిన 16 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.12,523, కనిష్ట ధర రూ.9,009 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement