ముగ్గురికి జైలు | - | Sakshi
Sakshi News home page

ముగ్గురికి జైలు

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

కాజీపేట: కాజీపేట పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 18 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష, 15 మందికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఫాతిమా చిన్నప్ప తీర్పునిచ్చారు. ట్రాఫిక్‌ సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ఇటీవల పోలీస్‌ సిబ్బంది నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 18 మంది పట్టుపడ్డట్లు తెలిపారు. వీరిలో బత్తుల దిలీప్‌, శివరాత్రి రాజు, అంబాల రాజులకు జైలు శిక్ష విధించగా హుజూరాబాద్‌ సబ్‌ జైలుకు పంపించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement