కోటను సందర్శించిన విదేశీయులు
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ మధ్యకోటను ఆదివారం కోల్‌కతా పర్యాటకులతో కలిసి అమెరికా దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు అద్భుతమైన శిల్ప కళా సంపదను తిలకించారు. అనంతరం ఖుషిమహల్, ఏకశిల గుట్ట, రాతి, మట్టికోట అందాలను వీక్షించారు. కాకతీయుల చారిత్రక విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ విదేశీయులకు వివరించారు. ఆ తర్వాత విదేశీయులు సెల్ఫీలు దిగుతూ.. చరిత్రను తెలుసుకుంటూ సరదాగా గడపారు. సాయంత్రం టీజీటీడీసీ కోట ఇన్‌చార్జ్ గట్టికొప్పుల అజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైటింగ్ షోను వీక్షించారు. కార్యక్రమంలో కేంద్ర పురావస్తుశాఖ కో ఆర్డినేటర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.


