సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Dec 22 2025 8:47 AM | Updated on Dec 22 2025 8:47 AM

సోమవా

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

– 8లోu

న్యూస్‌రీల్‌

నేడు కొలువుదీరనున్న గ్రామపాలక వర్గాలు

కొత్త సర్పంచ్‌లకు అనేక సవాళ్లు

రెండేళ్లుగా నిలిచిన గ్రామ పంచాయతీ నిధులు

బూజుపట్టిన జీపీ కార్యాలయాలు

ఎన్నికల్లో సమస్యల పరిష్కారానికి హామీలు

జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో మొదటిసారి సర్పంచ్‌లే

..అనే నేను

మరిపెడ రూరల్‌: పల్లె సంగ్రామం ముగిసింది. సోమవారం నూతన సర్పంచ్‌ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు డిసెంబర్‌ 11 నుంచి 17వ తేదీ వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరనుండగా.. గ్రామాల్లో తిష్ట వేసిన అనేక సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు కొత్త సర్పంచ్‌లకు సవాల్‌గా మారనుండగా.. వాటిని ఎలా పరిష్కరిస్తారోనని సర్వత్రా జిల్లా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది.

సగానికిపైగా కొత్త సర్పంచ్‌లే..

జిల్లాలో ఈసారి గెలుపొందిన సర్పంచ్‌ల్లో సాగానికిపైగా మొదటిసారి పదవులు చేపట్టిన వారే ఉన్నారు. జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 70శాతం పైగా మొదటిసారి సర్పంచ్‌గా గెలిచారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు.. పాలన అనుభవం లేనివారే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చారు. ఇందులో కొన్ని అమలుకు సాధ్యం కాని హామీలు కూడా ఉన్నాయి. కాగా వారికి హామీలను నెరవేర్చడం సవాల్‌గా మారనుంది.

అరకొర పనులు..

ప్రస్తుతం గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోవడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులే నిధులలేమితో అరకొర పనులు చేశారు. కాగా పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు.. పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఇప్పడైనా నిధులు విడుదలవుతాయని వారు ఆశతో ఉన్నారు.

రెండేళ్లుగా నిలిచిన నిధులు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లోని జనాభా ప్రకారం విడుదల చేస్తుంది. పంచాయతీల్లో పాలకవర్గాలు ఉన్న సమయంలోనే ఈ నిధులు కేటాయిస్తారు. కానీ రాష్ట్రంలో దాదాపు రెండేళ్ల నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో ఈ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మరి గ్రామాల్లో అత్యవసర పనులు చేయించుకున్నారు. నిధులు నిచిలిపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ కిస్తీలు, కరెంట్‌ బిల్లులు సైతం పెను భారంగా మారాయి. డీజిల్‌కు సైతం డబ్బులు లేని పరిస్థితి గ్రామ పంచాయతీల్లో నెలకొంది. ఇలా ఎన్నో సమస్యలతో పంచాయతీలు సతమతమవుతున్నాయి. ఈ సమస్యల కాకుండా ఎన్నికల ప్రచారంలో ఆలయాలు, కమ్యూనిటీ హాల్స్‌, సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మిస్తామని ప్రత్యేక హామీలు ఇచ్చారు.

నిలిచిపోయిన పనులు..

పలు గ్రామ పంచాయతీల్లో నూతన జీపీ భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో కల్వర్టులు దెబ్బతినడంతో గుంతలు ఏర్పడ్డాయి. రెండేళ్లగా ట్రాక్టర్లు కదలడం లేదు. దీంతో గ్రామాల్లో చెత్తసేకరణ నిలిచిపోయి చెత్త కుప్పలు పేరుకుపోయాయి. కనీసం నాటిన చెట్లకు నీరు పోసే పరిస్థితి లేదు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద నివారణ చర్యలు లేకుండా పోయాయి. సర్పంచ్‌లు లేక గ్రామాల్లో చేపట్టే పలు కార్యక్రమాలు సైతం నిలిచిపోయాయి. రెండేళ్ల పాటు గ్రామ పాలన లేక జీపీ కార్యాలయాలు బూజు పట్టి పోయాయి. కాగా నూతన పాలక వర్గాలతో తమ గ్రామాల్లోని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20251
1/1

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement