ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భద్రతా చర్యలు కీలకం. బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాం. మానవ తప్పిదాలు, వాహనాలు, అత్యధిక వేగం వలన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలను నివారించడానికి గుర్తులతో కూడిన బోర్డులను రోడ్డుపై ఏర్పాటు చేశాం. వాహనచోదకుల్లో చాలా మందికి వీటిపై అవగాహన ఉండట్లేదు. రోడ్డుపై ప్రయాణిస్తూ వాటిని చూడడం లేదు. వీటి గురించి తెలుసుకుంటే సురక్షితంగా ప్రయాణించవచ్చు.
– సురేష్‌రెడ్డి, డీటీసీ వరంగల్, హనుమకొండ


