మేడారం.. జనసంద్రం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద భక్తుల జల్లు స్నానాలు అచరించారు. అమ్మవార్లకు పుట్టు వెంకట్రులు సమర్పించుకున్నారు. తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పంచి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతంలో విడిది చేసి వంటార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. డీజే సౌండ్లతో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
ముందస్తు జాతర కళ
వేల సంఖ్యలో భక్తులు రావడంతో మేడారం ముందస్తుగా జాతర కళ సంతరించుకుంది. భక్తుల రద్దీతో తల్లుల గద్దెల ప్రాంగణం సందడిగా కనిపించింది. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. రోడ్లన్నీ భక్తుల వాహనాలతో బారులు తీరాయి. కొబ్బరి, బెల్లం కొనుగోళ్లతో దుకా ణాలు కిటకిటలాడాయి. అమ్మవార్ల గద్దెల వద్ద నుంచి భక్తులు పసుపు, కుంకుమను పవ్రితంగా ఇంటికి తీసుకెళ్లారు. భక్తుల రద్దీ నియంత్రించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ములుగు డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ట్రాఫిక్ జామ్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు.
కిక్కిరిసిన వనదేవతల గద్దెల ప్రాంగణం
తరలివచ్చిన వేలాది మంది భక్తులు
అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు
మేడారం.. జనసంద్రం
మేడారం.. జనసంద్రం


