అయోధ్యపురంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

అయోధ్యపురంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

Dec 22 2025 8:47 AM | Updated on Dec 22 2025 8:47 AM

అయోధ్యపురంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

అయోధ్యపురంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

కాజీపేట అర్బన్‌: కాజీపేట మండలం అయోధ్యపురంలో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్‌, రౌండ్‌టేబు ల్‌ సమావేశ సమన్వయకర్త దేవులపల్లి రాఘవేందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావే శం నిర్వహించారు. కోచ్‌ ఫ్యాక్టరీలో అయోధ్యపు రం వాసులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నిరుద్యో గ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, ప లు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 1979 లో కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉద్యమం చేపట్టిన బీఆర్‌ భగవాన్‌దాస్‌, కాళిదాసు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుర్పించా రు. ఈ సందర్భంగా కేయూ మాజీ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఐక్యంగా ముందు కు సాగుదామని పిలుపునిచ్చారు. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రైల్వే శాఖ మంత్రులతోపాటు రాష్ట్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించాలని సూచించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కయ్య మాట్లాడుతూ పోరాటాలతోనే కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు సాధిద్దామని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు సాధించేందుకు మరో పోరాటానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని భగవాన్‌దా స్‌ తనయుడు బీఆర్‌ లెనిన్‌ అన్నారు. వీసీకే పార్టీ అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్‌, న్యాయవాది గుడిమల్ల రవికుమార్‌ మాట్లాడుతూ భూనిర్వాసితులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని పార్లమెంట్‌లో ఎంపీలతో మాట్లాడించాలని సూచించారు. జేఏసీ కన్వీనర్‌ దేవులపల్లి రాఘవేందర్‌ మాట్లాడు తూ ఉద్యోగాల కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైల్వే జేఏసీ చైర్మన్‌ కొండ్ర నర్సింగ్‌ మాట్లాడుతూ తమ పోరా టానికి అందరూ సహకరించాలని కోరారు. సీఐటీ యూ నాయకులు కారు ఉపేందర్‌, రాగుల రమేశ్‌, భారత్‌ బచావో నాయకులు వెంగళ్‌రెడ్డి, రాంబ్రహ్మం, సీపీఐ నాయకులు రవి, వెంకట్రాజం, టీటీ యూ నేత మూల కృష్ణమూర్తి, అంబేడ్కర్‌ సంఘం నాయకులు జవాజీ కిషన్‌, మాల మహానాడు జాతీ య ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు, షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి పసునూరి మనోహర్‌, నాయకులు అంకేశ్వరపు రాంచందర్‌, సుంచు రాజేందర్‌, నరేందర్‌, రాజయ్య, ప్రదీప్‌కుమార్‌, కుమార్‌ పాల్గొన్నారు.

కోచ్‌ ఫ్యాక్టరీలో భూనిర్వాసితులు, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని

ప్రజాసంఘాల నాయకుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement