సాంకేతికాభివృద్ధిలో టీజీ ఎన్పీడీసీఎల్
హన్మకొండ: సాంకేతికాభివృద్ధిలో టీజీ ఎన్పీడీసీఎల్ ముందువరుసలో ఉందని ఆ కంపెనీ ఫైనా న్స్ డైరెక్టర్ వంటేరు తిరుపతిరెడ్డి అన్నారు. హనుమకొండ విద్యుత్ నగర్‌లోని తెలంగాణ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో విద్యుత్ అకౌంట్స్ అధికారుల అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. 17 జిల్లాల నుంచి అకౌంట్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వంటేరు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఎన్పీడీసీల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో పవర్ పర్చేజ్ కాస్ట్, తీసుకున్న అప్పుల వడ్డీ తగ్గింపుతో కంపెనీ వ్యయం తగ్గిందన్నారు. కంపెనీ పురోభివృద్ధిలో అకౌంట్స్ విభాగం తమవంతు పాత్రను సమర్థంగా నిర్వహిస్తుందన్నారు. అకౌంట్స్ విభాగంలో పని చేస్తునందుకు ప్రతీ ఒక్కరు గర్వపడాలని అన్నారు. కంపెనీ ప్రగతికి, ఆర్ధిక నిర్వహణలో అకౌంట్స్ అధికారుల పాత్ర అభినందనీయమన్నారు. అర్హులందరికీ యాజమాన్యం పదోన్నతి కల్పించిందన్నారు. అనంతరం విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.నాజర్ షరీఫ్, పి.అంజయ్య అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎన్.ఉపేందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎ.రా జేశం, ఉపాధ్యక్షులుగా కె.మాధవరావు, పి.రఘుపతి, ప్రధాన కార్యదర్శిగా ఎం.సుదర్శన్ రావు, సంయుక్త కార్యదర్శిలుగా ఈ.మురళి, చంద్రమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శిలుగా ఎ.రాజేంద్ర ప్రసాద్, రేష్మా, ఆర్థిక కార్యదర్శిగా బి.దేవేందర్, మహిళ కార్యదర్శిగా ఎం.సునీత, ముఖ్య సలహాదారుగా వేణుబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డిని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి విద్యుత్ అకౌంట్స్ అధికారులు ఘనంగా సన్మానించారు.
కంపెనీ నిర్వహణతో అకౌంట్స్ అధికారుల పాత్ర కీలకం
టీజీ ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి


