గెలిచిన, ఓడిన సర్పంచ్ అభ్యర్థుల్లో ఆందోళన
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ వేసిన నాటి నుంచి పోలింగ్ వరకు పదిహేనురోజుల గడువు మాత్రమే ఉంది. అయితే ఇంత తక్కువ సమయం ఉన్నా.. సర్పంచ్ పదవికి పోటీ చేసిన వారు చిన్న పంచాయతీల్లో కనీసం రూ.10 లక్షల నుంచి పెద్ద పంచాయతీల్లో రూ. 60 లక్షలకు పైగా ఖర్చుపెట్టినట్లు సమాచారం. ప్రధానంగా నామినేషన్ వేసే సమయం, ప్రధాన నాయకులు వచ్చినప్పుడు, ఊరిలో ప్రచారసమయంలో ఒకొక్కరికీ రూ.200 నుంచి రూ.400 వరకు కూలీ ఇచ్చిమరీ జనబలం నిరూపించుకున్నారు. వీటితోపాటు మందు, మాంసం, చికెన్, దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పిలిచేందుకు వాహనాలు పెట్టడం, వారికి ఖర్చులకు డబ్బులు ఇచ్చిపంపడం, చీరల పంపిణీ వంటి వాటితో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు అభ్యర్థులు తమకు వచ్చిన వచ్చిన గుర్తులు.. రింగ్, గ్యాస్ స్టౌ, కత్తెర, క్రికెట్ బ్యాట్ మొదలైనవి కొనుగోలు చేసి పంపిణీ చేశారు. పెద్ద కుటుంబాలు ఉన్నచోట పలువురు గొర్రెపోతులు, కుల సంఘాలకు పార్టీలు ఇచ్చి ఓటు వేయాలని కోరారు. ఇలా ఒకరిని చూసి మరొకరు పోటా పోటీగా ఖర్చు పెట్టారు.
అప్పుల
సంగతేంటి..?
పోటా
పోటీగా
ఖర్చు..
గెలిచిన, ఓడిన సర్పంచ్ అభ్యర్థుల్లో ఆందోళన


