న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి
మహబూబాబాద్ రూరల్ : అర్హులైన ప్రతీఒక్కరు ఉచిత న్యాయ సహాయాన్ని పొందాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ ప్రతినిధులతో జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయంపై శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయ వాల్‌పోస్టర్లను విడుదల చేసిన అనంతరం షాకెల్లి మాట్లాడారు. మహిళలు, పిల్లలు (18 సంవత్సరాల లోపు వారు), ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కార్మికులు, కస్టడీలో ఉన్న వ్యక్తులు, వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారు ఉచిత న్యాయ సహాయానికి అర్హులని తెలిపారు. న్యాయ సహాయం అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, కోర్టు లైజన్ అధికారి, ఎస్సై జీనత్, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి క్రాంతికుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు.
హక్కులను అమలు చేయాలి
శుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని జిల్లా న్యాయ సేవధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధ్యులు శనివా రం జిల్లా కేంద్రంలోని సబ్‌జైలును సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వర్ రావు ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. జైలు గదుల్లో గాలి, నీరు, శుభ్రమైన టాయిలెట్లు, వైద్యసేవలు కల్పించాల్సిన బాధ్యత అధికారులదేన న్నారు. అనంతరం ఖైదీల న్యాయ హక్కులపై సమీ క్ష నిర్వహించారు. అండర్ ట్రయల్ ఖైదీల పరిస్థితి, బెయిల్ అవకాశాలపై జైలు అధికారులు, ఖైదీలతో పరస్పర సంభాషణ జరిపారు. న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థను ఎంతగా ఉపయోగించుకోవాలో ఖైదీలకు అవగాహన కల్పించారు.


