సర్పంచ్‌లు గ్రామాలను అభివృద్ధి చేయాలి
మరిపెడ/మరిపెడ రూరల్: నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ పిలుపునిచ్చారు. శనివారం మరిపెడ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరరెడ్డి అధ్యక్షతన డోర్నకల్ నియోజకవర్గ స్థాయి నూతన సర్పంచ్‌లు అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఐఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్ కుమార్‌తో కలిసి రాంచంద్రునాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. సర్పంచ్‌లు హుందాగా వ్యవహరించాలన్నారు. గ్రామంలో సమస్యలు తెలుసుకుని నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి నియోజకవర్గానికి రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేశానన్నారు. 10 ఏళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా.. రెడ్యానాయక్ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ పెద్ద మనిషి ఎప్పుడైన గిరిజన జాతి కోసం అసెంబ్లీలో మాట్లాడినాడా.. అని ప్రశ్నించారు. రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా ఉండి బియ్యం, బెల్లం, ఇసుక దందాలు కొనసాగించారని, సీఎంఆర్ కింద రూ.12 కోట్లు ప్రభుత్వ సొమ్ము కాజేశాడని ఆరోపించారు. వందల కోట్లు ఇందిరమ్మ ఇళ్ల స్కాం చేసి ఎక్కడ జైలుపాలు కావాల్సి వస్తోందోనని బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఘనత డీఎస్ రెడ్యానాయక్ ఉందన్నారు. ఆయన బిడ్డ కవిత వందల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించిందని విప్ ప్రశ్నించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి, నాయకులు షేక్ అఫ్జల్, అంబరీష, రాంలాల్, రవీందర్‌రెడ్డి, బత్తుల శ్రీను, చంద్రయ్య, సుధాకర్‌నాయక్, ఐలమల్లు తదితరులు పాల్గొన్నారు.
మరిపెడలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం వందపడకల ఆస్పత్రికి ప్రభుత్వ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత తాలూక కేంద్రంగా ఉన్న కాలంలోనే ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి ఉందన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారిన సందర్భంగా జనాభా పెరుగడం, జాతీయ రహదారిపై ఉన్న ఆస్పత్రిని వందపడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. త్వరలోనే పనులు ప్రారంభం అయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంటికొమ్ము యుగేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, కుడితి నర్సింహరెడ్డి, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాంచంద్రునాయక్
సర్పంచ్‌లు గ్రామాలను అభివృద్ధి చేయాలి


