రేపు నూతన సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
మహబూబాబాద్: నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈనెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. పలుచోట్ల కొత్త సర్పంచ్‌లు సొంతఖర్చులతో జీపీ భవనాలకు రంగులు, ఏమైనా మరమ్మతులు ఉంటే చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్పెషల్ ఆఫీసర్లచే ప్రమాణ స్వీకారం జరుగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ముగియనున్న ‘స్పెషల్’ పాలన
జిల్లాలోని 18 మండలాల్లో 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన తర్వాత 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమైన స్పెషలాఫీసర్ల పాలన ప్రస్తుతం సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారంతో ముగియనుంది.
పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం
రెండు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. దీంతో పంచాయతీ కార్యదర్శులే గ్రామాల్లో నిర్వహణ బాధ్యుతలు చూసుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తెచ్చి పెట్టినా బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెలలో జరిగిన మూడు విడతల ఎన్నికల ఖర్చు సైతం పంచాయతీ కార్యదర్శులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
22న ప్రమాణ స్వీకారం
వాస్తవానికి ఈనెల 20వ తేదీన గ్రామపంచాయతీల పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేశారు. దీంతో ఈనెల 22న(సోమవారం) సంబంధిత అధికారులు జీపీల్లో ప్రమాణస్వీకార కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, స్పెసల్ ఆఫీసర్లే సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
సమస్యల స్వాగతం
రెండు సంవత్సరాలుగా నిధులు లేక గ్రామాల్లో చాలా సమస్యలు పేరుకుపోయాయి. నూతన సర్పంచ్‌లకు సమస్యల పరిష్కారం సవాల్‌గా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదలైతేనే సమస్యలకు పరిష్కారం లభించనుంది.
ముగియనున్న స్పెషలాఫీసర్ల పాలన
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు


