వాట్సాప్‌కు వచ్చే లింక్‌లు ఓపెన్ చేయొద్దు
● మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు
గార్ల: వాట్సాప్‌లకు వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. సైబర్ క్రైం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం గార్లలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్థిలకు అవగాహన కల్పించారు. కొందరు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ‘నేను బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను.. మీ అకౌంట్ ఏటీఎం బ్లాక్ అయింది.. మీ బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్పండి.. సరిచేస్తాం..’ అని చెబితే నమ్మి మోసపోవద్దని అన్నారు. అకౌంట్ నంబర్ చెబితే దుండగులు నగదు మాయం చేస్తారని వివరించారు. ఒకవేళ అకౌంట్ల నుంచి నగదు పోతే వెంటనే సైబర్ క్రైం పోలీసుల టోల్‌ఫ్రీ నంబర్ 1930కు సమాచారం అందించాలన్నారు. తల్లిదండ్రులకు సైతం సైబర్ క్రైం మోసాల గురించి వివరించాలని సూచించారు. 12 లేదా, 14 డిజిట్ నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దన్నారు. డీఎస్పీ వెంట సీఐ రవికుమార్, ఎస్సై సాయికుమార్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.


