రోడ్డు ప్రమాదాలు నివారించాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్
మహబూబాబాద్: రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్ సెఫ్టీ మాసంలో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థలను బాగస్వామ్యం చేసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి ఆయన.. సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్‌తో కలిసి శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. పక్కాగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అధికారులు పాల్గొన్నారు.


