సివిల్ కోర్టులు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఆపరేష్ కుమార్‌సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసు ల పరిష్కారానికి కొత్తగా కోర్టులు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. జ్యుడీషియల్ ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే విధులు సక్రమంగా నిర్వర్తిస్తారని, అందుకోసం మూడు జిల్లాల న్యాయ శాఖ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సింగరేణి వర్క్‌షాపు సమీపంలో ఏర్పాటు చేసిన కోర్టులు, అంబేడ్కర్ స్టేడియంలో క్రీడలను ప్రారంభించారు. హై కోర్టు న్యాయమూర్తి, మూడు జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తులు నా మవరపు రాజేశ్వర్‌రావు, మధుసూదన్‌రావు హైకో ర్టు చీఫ్ జస్టిస్‌తో కలిసి అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు, ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్య చంద్రకళ, మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, న్యాయమూర్తులు నాగరాజ్, కన్నయ్యలాల్, దిలీ ప్‌కుమార్‌నాయక్, అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌రావు, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్ పాల్గొన్నారు.


