పర్యాటక శాఖ బ్రోచర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: పర్యాటక శాఖ చేపట్టిన ‘వీకెండ్ డెస్టినేషన్’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన బ్రోచర్‌ను రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి రెండు నుంచి మూడు గంటల ప్రయాణించి వరంగల్‌కు చేరుకుంటే అనేక పర్యాటక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇవి దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు 50 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న 100 పర్యాటక ప్రాంతాలను ‘వీకెండ్ డెస్టినేషన్లు’గా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ క్రౌడ్ సోర్సింగ్ విధానంలో సమాచారం సేకరిస్తోందని, ఇందుకు అనుగుణంగా ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి తెలిపారు. పర్యాటక ప్రదేశానికి సంబంధించిన మూడు ఫొటోలు, 60 సెకన్ల వీడియో, వంద పదాల్లో ప్రత్యేకత వివరాలు జనవరి 5లోగా పంపాలని సూచించారు. విజేతలకు రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేల నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కై ట్ ఫెస్టివల్‌లో బహుమతులు అందజేస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. శివాజీ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు మంచి మెజారిటీ
● మాజీ మంత్రి ఎర్రబెల్లి
యాదగిరిగుట్ట: ఇటీవల జరిగిన గ్రామపంచా యతీ ఎన్నికల్లో అధిక గ్రామాల్లో కాంగ్రెస్ గెలి చినప్పటికీ.. పెద్ద గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన శనివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓట్ల సంఖ్య చూస్తే రాష్ట్ర వ్యా ప్తంగా బీఆర్‌ఎస్‌కు మంచి మెజారిటీ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని చిన్న జీపీల్లో బెదిరింపులకు పాల్పడి గెలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెడితే ప్రజలు బీఆర్‌ఎస్ వైపే నిలు స్తారన్నారు. కేసీఆర్‌ను పోగొట్టుకున్నామనే బాఽ ద ప్రజల్లో ఉందని, రాబోయేది బీఆ ర్‌ఎస్ ప్ర భుత్వమేనని ప్రజల్లో న మ్మకం ఉందని పేర్కొన్నారు.


