స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఫ్లెక్సీల కలకలం
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్లెక్సీ ల ఏర్పాటు కలకలం రేపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ బీఆర్‌ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ సర్పంచ్ తాటికొండ సురేశ్ తదితరులు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి శనివారం నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించే యత్నం చేయగా అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుని వాగ్వాదం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీల ఏర్పాటునకు అనుమతి ఉండాలని కమిషనర్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలకు అనుమతులు ఉన్నాయా అని నిలదీశారు. కాంగ్రెస్, ఎమ్మెల్యే కడియంకు తొత్తుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీఐ జి.వేణు, ఎస్సై వినయ్‌కుమార్ బీఆర్‌ఎస్ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా బీఆర్‌ఎస్ నాయకులు వినకపోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాయకులు పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పకుంటే గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
● తులం బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు అపహరణ
మహబూబాబాద్ రూరల్ : తాళం వేసి ఉన్నం ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో తులం బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌లోని పత్తిపాక ప్రాంతానికి చెందిన బండి అరుణ ఈ నెల 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం తమ స్నేహితురాలి ఇంటికి వెళ్లా రు. తిరిగి రాత్రి 8.30 సమయంలో ఇంటికొచ్చారు. తలుపులు పగులగొట్టి కనిపించగా ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. ఇంట్లోని బీరువా తలుపులు పగులగొట్టి ఉండడంతోపాటు అందులో గల తులం బంగారు చైన్‌తోపాటు పూజ గదిలోని 50 వెండి తులాలు అపహరణకు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, క్లూస్ టీం, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఏర్పాటు
తొలగింపునకు మున్సిపల్ సిబ్బంది, పోలీసుల యత్నం
అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు..అరెస్టు చేసిన పోలీసులు
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఫ్లెక్సీల కలకలం


