సీఏఐ అసోసియేట్ డైరెక్టర్‌గా బొమ్మినేని రవీందర్‌రెడ్డి
● 19న ముంబాయిలో
బాధ్యతల స్వీకరణ
వరంగల్: దేశంలో అత్యున్నత సంస్థ కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఏఐ) అసోసియేట్ డైరెక్టర్‌గా తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి నియమితులైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ తెలిపారు. శనివారం ముంబాయిలోని ప్రధాన కార్యాలయంలో రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపా రు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ 1921 నుంచి సంస్థ దేశ వ్యాప్తంగా గణనీయ సేవలు అందిస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని పత్తి పండించే ప్రాంతాలకు ప్రాతినిథ్య వహిస్తున్న 17 ప్రాంతీయ పత్తి సంఘాలు, 4 సహకార మార్కెటింగ్ సంఘాలు సీఏఐతో అనుబంధం కలిగి ఉన్నాయన్నా రు. కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2025–26 సంవత్సరానికి సేవా భావంతో మార్గ నిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేసిన నూతన కమిటీకి అధ్యక్షుడిగా వినయ్ ఎన్.కోటక్, అసోసియేట్ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డిని గత నెల 15వ తేదీన ఎన్నుకున్నట్లు తెలిపారు. ప్రా ముఖ్యత కలిగిన డైరెక్టర్ పదవీ బాధ్యతలు రవీందర్‌రెడ్డి శుక్రవారం కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా ముంబాయి కార్యాలయంలో చేపట్టినట్లు తెలిపారు. నూతన కమిటీకి సీఏఐ పూర్వ అధ్యక్షుడు అతుల్ ఎస్.గనట్రా, సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, ఇతర రాష్ట్రాల కాటన్ అసోసియేషన్ల ప్రతినిధులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించినట్లు రమేశ్ తెలిపారు.
సీఏఐ అసోసియేట్ డైరెక్టర్‌గా బొమ్మినేని రవీందర్‌రెడ్డి


