సులువుగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు
హన్మకొండ: డిజిటల్ పేమెంట్ ద్వారా విద్యుత్ బిల్లుల సులువుగా చెల్లించొచ్చని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్ట హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన డిజిటల్ విద్యుత్ బిల్లుల చెల్లింపు యంత్రం డిజిటల్ పేమెంట్ కియోస్క్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్‌గా మారుతున్న తరుణంలో ప్రతీ వినియోగదారుడు తమ నెల వారీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. వినియోగదారులు నగదు రహిత చెల్లింపు చేసేందుకు డిజిటల్ పేమెంట్ కియోస్క్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ బిల్లుల చెల్లింపు కేంద్రానికి వచ్చిన వినియోగదారులు ఆన్‌లైన్‌లో చెల్లించేలా అవగాహన కల్పించేందుకు ఉద్యోగిని నియమించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా డిజిటల్ పేమెంట్‌కు అలవాటు పడుతారని, తద్వారా ప్రతి ఒక్కరూ ఈ దిశగా మొగ్గు చూపుతారన్నారు. కార్యక్రమంలో సీజీఎం ఆర్.చరణ్ దాస్, జీఎంలు శ్రీనివాస్, వెంకట కృష్ణ, జయరాజ్, హనుమకొండ ఎస్‌ఏఓ నవీన్ కుమార్, డీఈలు విజేందర్ రెడ్డి, జి.సాంబ రెడ్డి, యూనియన్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ ఎం.రవీంద్ర బాబు, డీజీఎంలు గంటి కమలాకర్, వై.శ్రీకాంత్ కుమార్, అధికారులు మహేశ్, కుందన్ కుమార్, రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కియోస్క్ ద్వారా మరింత సులభం
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


