వర్షార్పణం.. | - | Sakshi
Sakshi News home page

వర్షార్పణం..

Oct 31 2025 8:06 AM | Updated on Oct 31 2025 8:08 AM

– మరిన్ని వర్షం వార్తలు, ఫొటోలు 8,9లోu

సాక్షి,మహబూబాబాద్‌/మహబూబాబాద్‌ రూరల్‌:

మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచాయి. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలగా.. పత్తి, పసుపు, మిరప పంటలు నీట మునిగాయి. కొన్నిచోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని పలు వాగుల ఉధృతితో పరివాహక పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందే సమ యంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

వరద నీటిలోనే పొలాలు..

జిల్లాలో చాలాచోట్ల వరి పంటలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. దీంతో ధాన్యం తడిసి మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సాగు చేసిన పంటలు అధిక వర్షాలు, వాగుల ఉధృతికి పూర్తిగా కోల్పోయి అప్పుల పాలయ్యామని, ప్రస్తుతం వరి పంట చేతికి అందివచ్చే సమయానికి తుపాను నిండా ముంచిందని రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.

15,614 మంది రైతులు..

26,029 ఎకరాల్లో పంటలకు నష్టం..

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 10,422 మంది రైతులకు చెందిన 16,617 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అలాగే 4,807 మంది రైతులకు సంబంధించి 8,782 ఎకరాల్లో పత్తి, 350మంది రైతులకు చెందిన 565 ఎకరాల మిర్చి, 35మంది రైతుల మొక్కజొన్న 65 ఎకరాలు ముంపునకు గురైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మొత్తంగా 15,614 మంది రైతులకు సంబంధించిన అన్ని రకాల పంటలు 26,029 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు వాటిల్లిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనా నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు.

జిల్లాలో ముంపునకు గురైన పంటలు(ఎకరాలలో)

మోంథా తుపాను తాకిడికి

దెబ్బతిన్న పంటలు

నేలవాలిన వరి, మొక్కజొన్న..

నీట మునిగిన పత్తి, మిరప చేలు

26,029 ఎకరాల్లో నష్టం

మండలం వరి మిర్చి పత్తి

బయ్యారం 2,488 – 192

గంగారం 180 – –

గార్ల 550 30 100

గూడూరు 980 80 190

ఇనుగుర్తి 600 30 –

కేసముద్రం 1,240 95 –

కొత్తగూడ 1,380 – –

మహబూబాబాద్‌ 860 40 100

నెల్లికుదురు 950 100 –

చిన్నగూడూరు 210 – 250

దంతాలపల్లి 1,050 – 1,300

డోర్నకల్‌ 1,135 190 1,430

కురవి 800 – 950

మరిపెడ 500 – 1,550

నర్సింహులపేట 418 – 950

పెద్దవంగర 1,546 – 100

సీరోలు 950 – 850

తొర్రూరు 780 – 820

వర్షార్పణం..1
1/2

వర్షార్పణం..

వర్షార్పణం..2
2/2

వర్షార్పణం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement