 
															నివేదికలు అందజేయాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: తుపాను ప్రభావంపై ప్రతీ రెండు గంటలకు ఒకసారి నివేదికలు అందజేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో తుపాను ప్రభావం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, తదితర అంశాలపై ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి సంబంఽధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వా గులు, చెరువుల్లో నీటి మట్టాలను గమనిస్తూ వివరాల ను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్స్యకార్మికులు వేటకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉపాధి అవకాశాలు కల్పించాలి
పరిశ్రమల శాఖ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్చేంజ్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (డీఐసీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ టీ ఫ్రైడ్ స్కీంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా యువతకు ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి కల్పించాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం శ్రీమన్నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
