 
															ఆక్రమణలపై విచారణ జరుపుతాం
● ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్
డోర్నకల్: డోర్నకల్‌లో చెరువులు, కుంటల ఆక్రమణపై విచారణ జరుపుతామని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, అంబేడ్కర్‌నగర్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం విప్ రాంచంద్రునాయక్ మాట్లాడారు. ఆక్రమణల వల్లే వరదలు వచ్చిన సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరువులు, కుంటల ఆక్రమణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమినర్ నిరంజన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌యాదవ్, పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్‌చంద్‌జైన్, నాయకులు మాదా శ్రీనివాస్, ఎస్. వెంకటేశ్వర్లు, తాళ్లూరి హనుమంతరావు, శీలం శ్రీనివాస్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
